Banswada News
కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం
Quick Summary:
చిన్నారుల భద్రతే లక్ష్యం.. బాన్సువాడలో వీధి కుక్కల పట్టివేత.
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ద్విచక్రవాహనదారులపై కుక్కలు ఇప్పటికీ 12 మందిపై దాడి చేసిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్ ఆదేశానుసారం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పర్యవేక్షణలో ప్రత్యేక బోలు వలలతో ప్రత్యేక బంధాలు ఏర్పడి కుక్కలను పట్టేందుకు శనివారం చర్యలు ప్రారంభించారు.మొదటగా వీధి కుక్కలకు శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్) నిర్వహించి వాటి సంఖ్యను నియంత్రించాలి. అలాగే రేబీస్ నివారణ టీకాలను వేయించి ప్రజల భద్రతను పెంచాలి. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట ఆశ్రయ కేంద్రాలకు తరలిస్తున్నారు.ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిశుభ్రత పాటించాలి. ఆహార వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల వీధి కుక్కలు ఎక్కువగా చేరుతాయి. కాబట్టి చెత్త నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలనీ చైర్ పర్సన్ సూచించారు.
