Banswada News
దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం.
Quick Summary:
డెంగ్యూ, మలేరియా నివారణకు చర్యలు.
5టీవీ న్యూస్ ప్రతినిధి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో దోమల బెడద పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఫాగింగ్ చేశారు. వర్షాల కారణంగా నిల్వ నీరు పెరగడంతో దోమలు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యగా ఫాగింగ్ నిర్వహించారు.డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్ తెలిపారు. ప్రజలు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.