Banswada News
కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు.
Quick Summary:
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు... మంజూరుపై వివరాల సేకరణ
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కొల్లూర్ గ్రామంలో గుడిసెలో నివాసం ఉంటున్న ఓ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.కుటుంబ సభ్యులు నివసిస్తున్న గుడిసెను సందర్శించిన అధికారులు వారి నివాస పరిస్థితులు, కుటుంబ ఆర్థిక స్థితి, అర్హతలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హత ఉంటే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ , సర్పంచ్ నాందేవ్, కార్యదర్శి రాధిక, ఉప సర్పంచ్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.