Banswada News
నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
Quick Summary:
నూతన యువశక్తులతో జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ సంస్థాగత నిర్మాణాలు
5టీవీ న్యూస్ బాన్సువాడ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనతో పాటు పలు సామాజిక అంశాలపై ఉద్యమాలు కొనసాగిస్తున్న ఎమ్మార్పీఎస్‌ను నూతన యువశక్తితో మరింత బలోపేతం చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32 సంవత్సరాలుగా కొనసాగుతోందని, వర్గీకరణ సాధన కోసం ప్రారంభమైన ఉద్యమం అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేస్తూ మానవతా ఉద్యమంగా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సామాజిక బాధ్యతతో మరిన్ని పోరాటాలు చేసి విజయాలు సాధించేందుకు యువతరం, నూతన శక్తులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలనే మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సంస్థాగత పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.జిల్లాలోని అన్ని మండలాలతో పాటు జిల్లా స్థాయిలో నూతన కమిటీల నిర్మాణంలో నవతరం, విద్యావంతులైన యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ పర్యవేక్షకులు కాదేపురం గంగన్న మాదిగ, మావురం శ్రీకాంత్ మాదిగ, సాయిలు మాదిగ తదితరులు పాల్గొన్నారు.నూతన కమిటీ మండల అధ్యక్షుడిగా టేకుర్ల శేఖర్ మాదిగ, అధికార ప్రతినిధిగా ఎడ్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా టేకుర్ల సాయిలు, కోశాధికారిగా ఎర్రోళ్ల గంగారాం, మాదిగ యువసేన కన్వీనర్‌గా కర్రోల్ల శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కమిటీ సలహాదారులుగా ఎడ్ల శంకర్, రొడ్డ వెంకట్, పోషయ్య, హనుమాండ్లు ఎన్నికయ్యారు.నూతన కమిటీ సభ్యులు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు సూచించారు.
