Banswada News
బాన్సువాడలో రేపు కరెంట్ మరమ్మత్తులు...
Quick Summary:
మరమ్మతుల కారణంగా ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు అంతరాయం.
5టీవీ న్యూస్ బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా రేపు (శుక్రవారం) ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.తాడ్కోల్ రోడ్డు, వాసవి కాలనీ, కోటగల్లీ, బీడీ కాలనీ, ఆర్థిక కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, రాములు హోటల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. విద్యుత్ అంతరాయానికి ప్రజలు సహకరించాలని విద్యుత్ ఏఈ సంతోష్ కుమార్ కోరారు.